Thursday, 24 December 2015

నిశ్శబ్దం వింత నిశ్శబ్దం

నిశ్శబ్దం వింత నిశ్శబ్దం
క్రీస్తు నాలో పుట్టిన రోజు
నా క్రిస్మస్ పండుగ రోజు
నిజ క్రిస్మస్ పండుగ రోజు
సర్వోన్నతమైన స్ధలములలో-
దేవునికి మహిమ
సకల చరాచర సృష్ఠిలో
సమాధానము
అహా.. ఆహా. అహా.. ఆహా
అహా...హా  ఆహహ .. హా  ఆహహహ
ఆహహహ హా ... ఆహహ హా
1. నా మోసపు తలపుల తలపై
ముళ్లు గుచ్చ బడినవి
నా మోహపు చూపుల
మోముపై ఉమ్మి వేయబడినది
నా చీకటి చేతుల కాళ్లకు
చీలలు దిగగొట్టబడినవి
కామ క్రోద మధ మత్సర దేహంలో
బళ్ళెము దిగబడినది |నిశ్శబ్దం|
2. నాకు నా వారికి నేను
వెళివేయబడినాను
నాకు లోకానికి నేను
సిలువ వేయబడినాను
వేలివేతలో సిలువ కోతలో
మృతుడైపోయాను
ఇల నాలో ఇక జీవించేది
నేను కాదు క్రీస్తే |నిశ్శబ్దం|

No comments:

Post a Comment