Friday, 25 December 2015

పరలోక పట్టణము

    పరలోక పట్టణము
    పండ్రెండు గుమ్మములు
    పండ్రెండు ముత్యములతో
    పదిలముగా కట్టబడె    ||పరలోక||

1    మండితంబగు పునాది
    సూర్యకాంతపు రాయి
    రెండవది నీలము
    మూడవది యమునా రాయి ||పరలోక||

2    పచ్చ వైఢూర్యము
    కెంపు సువర్ణము
    అచ్చ గోమేధికము
    పుష్య రాగము తోడ    ||పరలోక||

3    పదియవది సూనియము
    పదకొండు పద్మరాగము
    పండ్రెండు సుగంధము
    పండ్రెండు ముత్యములు     ||పరలోక||

4    శుద్ధ సువర్ణ వీధుల్‌
    స్వచ్ఛమైన స్ఫటికము
    సుందరముగా నుండు
    సిద్ధపడిరండి     ||పరలోక||

5    గొఱ్ఱెపిల్ల దీపం
    సూర్యుడక్కరలేదు
    భూరాజుల్‌ తమ మహిమన్‌
    తీసికొని వచ్చెదరు    ||పరలోక||

6    జీవజలముల నది
    ప్రవహించు చుండెను
    జీవంబు గల్గును
    జీవించుదురు ప్రజలు     ||పరలోక||

7    ఇరుప్రక్కల నదికి
    జీవ వృక్షముండె
    పండ్రెండు నెలలకు
    పండ్రెండు కాపులు కాయు     ||పరలోక||

20 comments: