Friday, 25 December 2015

చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార

    చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార 
    చూడరే క్రీస్తుని జూడరే
    చూడరేనా ముక్తి పదవికి
    ఱేడు యేదశ గూడినాడో     ||చూడరే||

1    మించి పొంతి పిలాతు సత్యమొ 
    కించుకైనఁదలంప కక్కట
    వంచనను గొట్టించి యూదుల
    మంచితనమే కోరి యప్ప-గించెనా
    మేలు గ-ణించెనా 
    ఇతనిగాంచి కాంచి భక్తులెట్లు
    స హించిరో పరికించి మీరిది ||చూడరే||

2    మంటికిని నాకాశమునకును 
    మధ్యమున వ్రేలాడుచుండగ
    నంటఁగొట్టగ సిలువ మ్రాని 
    కప్పగించుటకొరకు నిన్ను ఁగాంచెనా
    యిది మది నెంచెనా హానా-కంట
    నే నిటువంటి యాపదఁగంటిఁ
    బ్రాణములుండునే యికఁ   ||చూడరే||

3    ఊటగా రక్తంబు కారుచు
    నుండ బల్లెపుఁ బ్రక్కపోటు
    మాటిమాటికిఁ జూడ దుఃఖము
    మరలునే తలమీద ముళ్ళకిరీటమా 
    యితనికి వాటమా
    యూదులు మోటులై బాహాటమున నీ 
    పాటులను గాటముగ జేసిరి ||చూడరే||

No comments:

Post a Comment