Friday, 25 December 2015

దేవ సంస్తుతి చేయవే మనసా

    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు
    యెహోవ సంస్తుతి చేయవే మనసా
    దేవ సంస్తుతి చేయుమా
    నా జీవమా యెహోవా దేవుని
    పావన నామము నుతించుమా
    నా యంతరంగములో
    వశించునో సమస్తమా    ||దేవ||

1    జీవమా, యెహోవా నీకు
    జేసిన మేళ్లన్‌ మరువకు
    నీవు చేసిన పాతకంబులను
    మన్నించి జబ్బు
    లేవియున్‌ లేకుండ జేయును
    ఆ కారణముచే    ||దేవ||

2    చావు గోతి నుండి నిన్ను
    లేవనెత్తి దయను గృపను
    జీవ కిరీటముగ వేయును
    నీ శిరసు మీద
    జీవ కిరీటముగ వేయును
    ఆ కారణముచే    ||దేవ||

3    యౌవనంబు పక్షిరాజు
    యౌవనంబు వలెనె క్రొత్త
    యౌవనంబై వెలయునట్లుగ
    మేలిచ్చి నీదు
    భావమును సంతుష్టి పరచునుగా
    ఆ కారణముచే    ||దేవ||

4    ప్రభువు నీతి పనులు చేయున్‌
    బాధితులకు న్యాయ మిచ్చున్‌
    విభుడు మార్గము తెలిపె మోషేకు
    దన కార్యములను
    విప్పె నిశ్రాయేలు జనమునకు
    ఆ కారణముచే          ||దేవ||

5    అత్యధిక ప్రేమ స్వరూపి
    యైన దీర్ఘ శాంతపరుడు
    నిత్యము వ్యాజ్యంబు చేయడు
    ఆ కృపోన్నతుడు
    నీ పయి నెపుడు కోపముంచడు
    ఆ కారణముచే         ||దేవ||

6    పామరుల మని ప్రత్యుపకార
    ప్రతి ఫలంబుల్‌ పంపలేదు
    భూమికన్న నాకసంబున్న
    యెత్తుండు దైవ 
    ప్రేమ భక్తి జనుల యందున
    ఆ కారణముచే         ||దేవ||

7    పడమటికి తూర్పెంత యెడమో
    పాపములకును మనకు నంత
    యెడము కలుగ జేసియున్నాడు
    మన పాపములను
    యెడముగానే చేసియున్నాడు
    ఆ కారణముచే         ||దేవ||

8    కొడుకులపై దండ్రి జాలి
    పడు విధముగా భక్తిపరుల
    యెడల జాలి పడును దేవుండు
    తన భక్తిపరుల
    యెడల జాలిపడును దేవుండు
    ఆ కారణముచే        ||దేవ||

9    మనము నిర్మితమయిన రీతి
    తనకు దెలిసియున్న సంగతి
    మనము మంటివార మంచును
    జ్ఞాపకము చేసి
    కొనుచు కరుణ జూపుచుండును
    ఆ కారణముచే        ||దేవ||

10పూసి గాలి వీవ నెగిరి
    పోయి బసను దెలియని వన
    వాస పుష్పము వలెనె నరుడుండు
    నరు నాయువు తృణ
    ప్రాయము మన దేవ కృప మెండు
    ఆ కారణముచే        ||దేవ||

11పరమ దేవ నిబంధ నాజ్ఞల్‌
    భక్తితో గైకొను జనులకు
    నిరతమును గృప నిలిచి యుండును
    యెహోవా నీతి
    తరముల పిల్లలకు నుండును
    ఆ కారణముచే        ||దేవ||

No comments:

Post a Comment