మనస యేసు మరణ బాధ
లెనసి పాడవే-తన-నెనరు జూడవే
యా ఘనునిఁగూడవే
నిను మనుప జచ్చుటరసియే
మరక వేఁడవే ||మనస||
1 అచ్చి పాపములను బాప వచ్చినాడట
వా-క్కి-చ్చి తండ్రితో
నా-గెత్సెమందున-తా జొచ్చి యెదను
నొచ్చి బాధ-హెచ్చుగనెనట ||మనస||
2 ఆ నిశీధ రాత్రి వేళ-నార్భటించుచు
నయ్యో నరాంతకుల్
చేఁబూని యీటెలన్
ఒక ఖూని వాని వలెను గట్టి
కొంచుబోయిరా ||మనస||
3 పట్టి దొంగవలెను గంత గట్టికన్నులన్
మరి గొట్టి చెంపలన్
వడిదిట్టి నవ్వుచున్
నిను గొట్టి రెవ్వరదియు మాకు
జెప్పు మనిరట ||మనస||
4 ముళ్ళతోడ నొక కిరీట మల్లిప్రభు తలన్
బెట్టి రెల్లుకఱ్ఱతో
నా కల్ల జనములు
రా జిల్లుమనుచుకొట్టి నవ్వి
గొల్లుబెట్టిరా ||మనస||
5 మొయ్యలేక సిల్వ భారము
మూర్ఛబోయెనా
ఆ య్యయ్యో జొక్కెనా
యే సయ్యతూలెనా
మాయయ్యనిన్ దలంప
గుండె-లదరి పోయెనా ||మనస||
6 కాలుసేతులన్ గుదించి కల్వరి గిరిపై
నిన్ గేలిజేయుచు
నీ కాళ్ల మీదను
నినుప చీలలతో గ్రుచ్చి
నిన్ను సిల్వ గొట్టిరా ||మనస||
7 దేవ సుతుండవైతి వేని తీవరంబుగా
దిగి నీవు వేగమే
రమ్ము గావు మనుచును
ఇట్లు గావరించి పల్కు వగర
కరుణ జూపెనా ||మనస||
8 తన్ను జంపు శత్రువులకు
దయను జూపెనా
తన నెనరు జూపెనా
ప్రభు కనికరించెనా
ఓ జనక ఈ జనుల క్షమించు
మనుచు వేఁడెనా ||మనస||
9 తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా
నన్నేలువానికి
నా పాలి స్వామికి
నే-నేల పాపములను జేసి
హింసపరచితి ||మనస||
10గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు
మాట్లాడి ప్రేమతో
నా-నాడు శిరమును
వంచి నేఁడు ముగిసె సర్వమనుచు
వీడె బ్రాణము ||మనస||
11 మరణమైన ప్రభుని జూచి
ధరణి వణఁకెనా
బల్ గిరులు బగిలెనా
గుడి తెరయుఁజీలెనా
దివా కరుడు చీకటాయె
మృతులు తిరిగి లేచిరి ||మనస||
12ఇంత జాలి యింత ప్రేమ
యింత శాంతమా
నీ యంతఃకరుణను
నేఁ జింతచేయగా
నీ వింత లెల్ల నిత్యజీవ
విధము లాయెనా ||మనస||
లెనసి పాడవే-తన-నెనరు జూడవే
యా ఘనునిఁగూడవే
నిను మనుప జచ్చుటరసియే
మరక వేఁడవే ||మనస||
1 అచ్చి పాపములను బాప వచ్చినాడట
వా-క్కి-చ్చి తండ్రితో
నా-గెత్సెమందున-తా జొచ్చి యెదను
నొచ్చి బాధ-హెచ్చుగనెనట ||మనస||
2 ఆ నిశీధ రాత్రి వేళ-నార్భటించుచు
నయ్యో నరాంతకుల్
చేఁబూని యీటెలన్
ఒక ఖూని వాని వలెను గట్టి
కొంచుబోయిరా ||మనస||
3 పట్టి దొంగవలెను గంత గట్టికన్నులన్
మరి గొట్టి చెంపలన్
వడిదిట్టి నవ్వుచున్
నిను గొట్టి రెవ్వరదియు మాకు
జెప్పు మనిరట ||మనస||
4 ముళ్ళతోడ నొక కిరీట మల్లిప్రభు తలన్
బెట్టి రెల్లుకఱ్ఱతో
నా కల్ల జనములు
రా జిల్లుమనుచుకొట్టి నవ్వి
గొల్లుబెట్టిరా ||మనస||
5 మొయ్యలేక సిల్వ భారము
మూర్ఛబోయెనా
ఆ య్యయ్యో జొక్కెనా
యే సయ్యతూలెనా
మాయయ్యనిన్ దలంప
గుండె-లదరి పోయెనా ||మనస||
6 కాలుసేతులన్ గుదించి కల్వరి గిరిపై
నిన్ గేలిజేయుచు
నీ కాళ్ల మీదను
నినుప చీలలతో గ్రుచ్చి
నిన్ను సిల్వ గొట్టిరా ||మనస||
7 దేవ సుతుండవైతి వేని తీవరంబుగా
దిగి నీవు వేగమే
రమ్ము గావు మనుచును
ఇట్లు గావరించి పల్కు వగర
కరుణ జూపెనా ||మనస||
8 తన్ను జంపు శత్రువులకు
దయను జూపెనా
తన నెనరు జూపెనా
ప్రభు కనికరించెనా
ఓ జనక ఈ జనుల క్షమించు
మనుచు వేఁడెనా ||మనస||
9 తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా
నన్నేలువానికి
నా పాలి స్వామికి
నే-నేల పాపములను జేసి
హింసపరచితి ||మనస||
10గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు
మాట్లాడి ప్రేమతో
నా-నాడు శిరమును
వంచి నేఁడు ముగిసె సర్వమనుచు
వీడె బ్రాణము ||మనస||
11 మరణమైన ప్రభుని జూచి
ధరణి వణఁకెనా
బల్ గిరులు బగిలెనా
గుడి తెరయుఁజీలెనా
దివా కరుడు చీకటాయె
మృతులు తిరిగి లేచిరి ||మనస||
12ఇంత జాలి యింత ప్రేమ
యింత శాంతమా
నీ యంతఃకరుణను
నేఁ జింతచేయగా
నీ వింత లెల్ల నిత్యజీవ
విధము లాయెనా ||మనస||
No comments:
Post a Comment