Friday, 25 December 2015

మన కొరకై వచ్చాడు

మన కొరకై వచ్చాడు
    తన ప్రాణం పెట్టాడు
    నిన్ను నన్ను యేసు ప్రేమించాడు
    తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు
    తన అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు

1    స్వంత జనం మరచినను
    మరువడాయన
    నీతి సూర్యుడైన తండ్రి 
    యేసు దేవుడే
    పరిస్థితులు మారినను
    యేసు నిన్ను మరచిపోడు
    సిలువలో ప్రాణం బెట్టె
    సమయంలో మరువలేదే

2    పనికిరాని వాడవని త్రోసివేసినా
    అబ్రాహాము దేవుడు నిన్ను
    త్రోసివేయడు
    దిక్కులేని వారినంతా 
    చేర్చుకొనే రక్షకుడు
    జడియకు నా బిడ్డలారా
    యంటు ఆదరించు

3    వ్యాధి గలవాడవని నెట్టి వేశారు
    సూటి పోటి మాటలతో 
    గాయపరిచారు
    చావనా బ్రతకనాయని నీవేడ్చి
    కుమిలిపోతే
    బ్రతికే వుండాలని
    నీ వ్యాధిని తీసివేసె

4    కష్టపడెటప్పుడు ఎవ్వరు
    సాయం చేయరు
    అప్పులను తీర్చువారు
    అసలే లేరు
    ఇష్టమైన దేవతలను 
    పూజించి చూశాము
    మన కష్టాలను తీర్చ అవి
    ముందుకు రాలేదు
    ఈ లోక దేవతలు అన్నియును
    వట్టివండి
    యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడండి
    పాపములన్ని బాపి రక్షించే
    దేవుడండి

2 comments: