Friday, 25 December 2015

స్తోత్రము సేయరే - సోదరులార

    స్తోత్రము సేయరే - సోదరులార
    మన యాత్మలతో దండ్రిన్‌
    ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు 
    స్తోత్రములో గలిపి    ||స్తోత్రము||

1    ఇచ్చట ప్రేమల కిదియే కడవరి 
    వచ్చియున్న దేమో అచ్చట
    మన మందరము గలిసికొని
    యానందింతుముగా     ||స్తోత్రము||

2    ఎక్కువ ప్రేమలు-చక్కని స్తోత్రము
    లక్కడ మన మంత
    మిక్కిలి ప్రియుడగు దేవుని కిడుదము 
    ఒక్క మనసుతోను    ||స్తోత్రము||

3    కన్నీరుండదు-చావు కష్టము
    లెన్నటికుండవుగా
    కన్నను మన శృంగారపు బ్రతుకు
    లెన్న దరముగాదె
    ||స్తోత్రము||

4    వాగును వీణెలు-సాగును పాటలు
    సతతముగా నచట
    రాగములెంతో-రమ్యమై యుండును 
    బాగింతన లేము
    ||స్తోత్రము||

5    మరల నిచట గూ-డుదమో లేదో
    మన మందరము 
    త్వరలో మన పర-లోకపు దండ్రి 
    తోడనుందు మేమో    ||స్తోత్రము||

6    గొఱ్ఱెపిల్ల రక్తము-విలువచ్చట
    గొప్పది గాంతుముగా
    గురుతర మగు మన దేవుని ప్రేమను 
    కూర్మితో జూతుముగా     ||స్తోత్రము||

7    పరమ తండ్రితో-ప్రభు యేసునితో
    బరిశుద్ధాత్మునితో
    స్థిరముగ నుందుము-మరి దూతలతో 
    బరలోకము నందున్‌    ||స్తోత్రము||

1 comment:

  1. very very beautiful song. SP balu sang once in 1985 or so

    ReplyDelete