Friday, 25 December 2015

నిన్ను నేను విడువను దేవ

    నిన్ను నేను విడువను దేవ
    నీవు నను దీవించు వరకు
    నిన్ను నమ్మిన వారలనెల్ల
    నీవు చక్కగ దీవించెదవు               ||నిన్ను||

1.    నేను శత్రువునైయుండగ
    నీవు నాపై నెనరు జూపి
    దానమిచ్చితివి నా కొరకు
    దారుడౌ నీ ప్రియ పుత్రుని         ||నిన్ను||

2.    త్రోవదప్పి తిరుగుచుండ
    దుడుకునైన నన్ను గాంచి
    ప్రోవగోరి మదిని నీవు
    త్రోవను బెట్టితివి నన్ను         ||నిన్ను||

3.    నాట నుండి నేటి వరకు
    నాకు గల్గిన శోధనములలో
    నేటుగా నను గాచినవాడవు
    నీవుగావా, ఓ నా తండ్రి         ||నిన్ను||

4.    ఇంతకాలము నన్నుగాచి
    యికను నన్ను విడువ వనుచు
    సంతసించి మదిని నేను
    జక్కగ     నీదరి జేరితిని        ||నిన్ను||

5.    నీవుగాక యెవరున్నారు
    నేలపైని నను గాపాడ
    చేవలేని నాకు నీవు
    చేవ గలుగజేయగలవు         ||నిన్ను||

6.    అడుగువారి కిచ్చెద నంచు
    నానతిచ్చినావు గాన
    నడిగెద నిను సహాయ్యంబు
    నాత్మవై యున్నట్టి తండ్రి         ||నిన్ను||

7.    నాదు ప్రార్థన లన్నియు నీవు
    నీదు కృపచే నాలకించి
    నీదు సరణిని నిల్పి నన్ను
    నేర్పుదనరగ రక్షించితివి        ||నిన్ను||

No comments:

Post a Comment