Friday, 25 December 2015

విశ్వాసి నీలోనీవే-విమర్శ చేసికొనుమా

    విశ్వాసి నీలోనీవే-విమర్శ చేసికొనుమా
    విశ్వాస పూరిత హృదయ
    ముండెనో లేదో నీకు   

1    సేవచేయుచుంటి వటంచు
    సంతసించు చుంటివేమో
    కొయ్యకాలు కఱ్ఱ గడ్డి
    కాలురీతిగా నున్నదేమో      ||విశ్వాసి||

2    పదిమంది కన్యకలేమో
    పిలువబడిరి పెండ్లి విందుకు
    పోలేక పోయి రందు
    ఐదుగురు అజాగ్రత్తచే      ||విశ్వాసి||

3    మునుపున్న రీతిగానే
    నేడుంటినని సంసోను
    యెరుగలేక దేవుని విడుపు 
    పొందెనోయి అంధత్వమును ||విశ్వాసి||

4    విస్తారమగు పనులెన్నో
    వేసికొనియె మన మార్తమ్మ   
    ఉత్తమమగు దారిలో
    నున్నావో లేదో నీవు      ||విశ్వాసి||

5    నీ విధిని మరచి నీవు
    పాతిపెట్టి నావ తలాంతు
    దొంగ వచ్చినట్లు వచ్చి
    దండించు నేమో నిన్ను       ||విశ్వాసి||

6    నీ జీవిత లక్ష్యమేమి
    నీకున్నదీక్ష యేమి
    గురిలేని పోరాటములో
    గడచు చుండె నేమో కాలం  ||విశ్వాసి||

2 comments: