Friday, 25 December 2015

యేసు క్రీస్తు దొరికెనేని

    యేసు క్రీస్తు దొరికెనేని
    యేమి కొదువింకేమి భయము
    దోసకారి జనుల కెంతోఁ
    గ్రాసమవు నా యేసు పేరు  ||యేసు||

1    తల్లిదండ్రుల కన్న చాలాఁ 
    దన ప్రేమ మన మీద 
    నెల్లకాల మందు నుంచు
    యేసుఁడే మా తండ్రి యౌను ||యేసు||

2    వల్లగాని వశములేని
    యెల్ల మేళ్ళన్నిటి నెల్లపుడు
    కొల్లగా     మన కిచ్చెడి దేవ
    కొమరుఁడే వేరెవరు లేరు      ||యేసు||

3    దండియైన గండములు
    మెండుగాను మముఁజుట్టిన
    తండ్రివలె మా దరికి వచ్చి 
    గండములను గదిమిఁ బ్రోచున్‌   

4    సత్యము మార్గము తానె
    నిత్య జీవ మింకా తానే
    భృత్యుల మన కీయ మోక్షము
    భువిని రక్తమంత గార్చె      ||యేసు||

5    ఎన్నరాని పాపాత్ముల 
    కన్నులారా కనికరించి
    పున్నెమైన తన ప్రాణము
    భువిని బలి పెట్టినాఁడు      ||యేసు||

6    ఒడలు నిండా గాయములతో
    నడరుచుండ మరల లేచి
    వెడలి పరమందునుండి
    వేడుకలు మా కంపినాఁడు      ||యేసు||

7    ఆశతోడ ఁదన్ను నమ్ము
    యాత్మలకు దర్శన మిచ్చెడి
    యేసుతో నింకెవరు సాటి
    లేశమైనా లేరు సుండీ      ||యేసు||

No comments:

Post a Comment