Friday, 25 December 2015

సంతోషం పొంగెను - సంతోషం పొంగెను

    సంతోషం పొంగెను - సంతోషం పొంగెను 
    సంతోషం పొంగిపొర్లెను... హల్లెలూయ
    యేసునన్ను రక్షించెన్‌... నా పాపము 
    కడిగెన్‌ సంతోషం పొంగి పొర్లెను

1. త్రోవ తప్పి తిరుగుచుంటిని 
    ఆ త్రోవలోనే పడిపోతిని
    అయినన్‌ యేసు కరుణించెన్‌
    తానె నన్ను రక్షించెన్‌(2)
    ఇంత వరకు కాచినాడు 
    మంచి యేసుడే     ||సంతోషం||

2. దేవుని సెలవు పొంది
    సాతాను శోధించును
    అయినన్‌ యేసు విడువడు
    తానె వచ్చి రక్షించును (2)
    ఇంత మంచి యేసు నాకు
    స్వంతమాయెను    ||సంతోషం||

3. మారుమనసు లేని ప్రజలు 
    పాతాళ మందు ప్రలాపింతురు 
    నేను పరమందున
    క్రొత్త గీతం పాడెదన్‌ 
    నాలోనున్న యేసుతో 
    నిరంతరముందును    ||సంతోషం||

4 comments: