Friday, 25 December 2015

ఎల్లవేళలందు - కష్టమందైనను

    ఎల్లవేళలందు - కష్టమందైనను
    కృతజ్ఞాస్తుతులు - చెల్లింతున్‌
    యేసువా నిన్ను నే - స్తుతింతున్‌ స్తుతింతున్‌
    జీవిత - మంతయు - స్తుతింతున్‌

1. ఆదియు నీవే - అంతము నీవే
    జ్యోతియు నీవే-నా శాంతియు నీవే ||ఎ||

2.  తల్లి దండ్రియు - దాతవు నీవే
    కోటయు నీవే-నా బాటయు నీవే  ||ఎ||

3. వ్యాధిలో నీవే - వృద్ధిలో నీవే
    బాధలో నీవే - నా సాధకుడవు     ||ఎ||

4. రక్షణ నీవే - దీక్షయు నీవే
    కాపరి  నీవే - నా కర్తవు నీవే      ||ఎ||

5. ఆధారం నీవే - ఆనందం నీవే
    మోక్షము నీవే - నిరీక్షణ నీవే      ||ఎ||

6. దివిలో నీవే - భువిలో నీవే
    అపాయములో-సహాయము నీవే  ||ఎ||

7. దైవము నీవే - జీవము నీవే
    రాజువు నీవే - నా సర్వము నీవే   ||ఎ||

No comments:

Post a Comment