Friday, 25 December 2015

చూడుము గెత్సెమనే

    చూడుము గెత్సెమనే
    తోటలో నా ప్రభువు
    పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి
    ధ్వని వినబడుచున్నది
    పాపి నీకై విజ్ఞాపన చేసెడి
    ధ్వని వినబడుచున్నది

1    దేహమంతయు నలిగి 
    శోకము చెందినవాడై
    దేవాది దేవుని ఏకైక సుతుడు
    పడు వేదనలు నా కొరకే

2    తండ్రి ఈ పాత్ర తొలగున్‌
    నీ చిత్తమైన యెడల
    ఎట్లయినను నీ చిత్తము చేయుటకు
    నన్నప్పగించితివనెను

3    రక్తపు చెమట వలన
    మిక్కిలి బాధనొంది
    రక్షకుడేసు హృదయము
    పగులగ విజ్ఞాపనము చేసెనే

4    ముమ్మారు భూమి మీదపడి
    మిక్కిలి వేదనచే మనయేసు
    ప్రభువు తానే వేడుకొనెను
    పాపుల విమోచన కొరకే

5    ప్రేమామృత వాక్కులచే
    ఆదరించెడి ప్రభువు వేదన
    సమయమున బాధపరచెడి
    వారి కొరకు ప్రార్థన చేసెనే

6    నన్ను తన వలె మార్చెడి
    ఈ మహా ప్రేమను తలచి
    తలచి హృదయము కరుగగ
    సదా కీర్తించెదను

No comments:

Post a Comment