Friday, 25 December 2015

నాదు ప్రాణమా - నాదు ప్రాణమా

    నాదు ప్రాణమా - నాదు ప్రాణమా
    దేవుని క్రియల్మరువకుమా
    ఆయన చేసిన దేనిన్‌ మరువకుమా

1    వ్యర్ధుడవై - నాశనంబౌ
    నిన్ను రక్షించి మోక్ష నగరు చేర్చను 
    తనదు     ప్రాణమిచ్చెనె
    ఓ నా మనసా ఎంతటిప్రేమ
    దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||

2    ప్రియులు లేక - భ్రమసి నీవు
    పరుడవైనపుడు - ప్రియుడేసు
    నిన్ను చేరి - సంతసంబిడెనె
    సమర్పించు - సర్వము తనకై
    దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||

3    రక్షణాలం - కార వస్త్రము
    జీవాహారము - శాంతి
    సమాధానము నీతి - నీకు నిచ్చెనె
    ప్రేమ పరిమళ స్తుతులను పాడి
    దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||

4    గెత్సెమనెలో కార్చెనేసు
    రక్త చెమటలను - వేదనతో 
    విజ్ఞాపనము - నీ కొరకు జేసెన్‌ 
    వినుమా మనసా - ఏడ్చెను నీకై
    దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||

5    వస్తాననిన - కాలమాయె
    తామసంబేల - ప్రభుని రాక 
    బూర ధ్వనించు - కాలమెప్పుడో
    ఆశతో ప్రభుని - రాకను కోరి
    దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||

No comments:

Post a Comment