Friday, 25 December 2015

దేవుడే నా కాశ్రయంబు

    దేవుడే నా కాశ్రయంబు
    దివ్యమైన దుర్గము 
    మ-హా వినోదు డాపదల
    స-హాయుడై నన్‌ బ్రోచును
    అభయ-మభయ-మభయ మెప్పు    
    డానందమానంద మానందమౌగ   

1.    పర్వతములు కదిలిన నీ
    యుర్వి      మారుపడినను 
    సర్వమున్‌ ఘోషించుచు నీ 
    సంద్రముప్పొంగినన్‌ 
    అభయ-మభయ-మభయ    ||దేవుడే||

2.    దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును 
    ఆ-తావునందు ప్రజలు మిగుల 
    ధన్యులై వసింతురు 
    అభయ-మభయ-మభయ  ||దేవుడే||

3.    రాజ్యముల్‌ కంపించిన
    భూ-రాష్ట్రముల్‌ ఘోషించిన 
    పూజ్యుడౌయెహోవ వైరి
    బూని సంహరించును
    అభయ-మభయ-మభయ   ||దేవుడే||

4.    విల్లు విఱుచు నాయన తెగ
    బల్లెము నఱకు నాయన 
    చెల్ల చెదర జేసిరిపుల 
    నెల్లద్రుంచు నాయనే
    అభయ-మభయ-మభయ   ||దేవుడే||

5.    పిశాచి పూర్ణబలము నాతో
    బెనుగులాడ జడియును
    నశించి శత్రుగణముదేవు 
    నాజ్ఞ వలన మడియును 
    అభయ-మభయ-మభయ   ||దేవుడే||

6.    కోటయు నాశ్రయమునై యా
    కోబు దేవుడుండగ 
    ఏటికింక వెరవవలయు
    నెప్డు నాకు బండుగ 
    అభయ-మభయ-మభయ   ||దేవుడే||

No comments:

Post a Comment