Friday, 25 December 2015

పాపిని కృప జూపవయ్యా - దాపు

    పాపిని కృప జూపవయ్యా - దాపు 
    జేరితిని యేసయ్యా
    పాప భారము క్రింద శ్రమపడి  
    కృంగియున్నాను యేసయ్యా

1    వేషభాషల తోడ నిండి
    మోసపోయితిని యేసయ్యా
    దోసిలొగ్గి నిన్ను జేరితి
    దాసునిగ బ్రోవు మేసయ్యా       ||పాపిని||

2    నీతిలేని నాదు జీవిత 
    మేల నికనయ్యా యేసయ్యా
    నీతి గరపి బ్రోవుమయ్యా 
    నీతి నిడవయ్యా యేసయ్యా  ||పాపిని||

3    నీదు సిలువలోని ప్రేమ
    నెంచదరమౌనె యేసయ్యా
    నాదు కలుషమంత బాపి
    కనికరింపుమా యేసయ్యా       ||పాపిని||

4    నీదు రక్తధారలే యిల
    పాపికాశ్రయము యేసయ్యా
    నీతిమంతుల జేయుమయ్యా
    నీతి సూర్యుండా యేసయ్యా  ||పాపిని||

5    దాపుగోరిన వారలకు నీ
    పాప్రు జూపితివి యేసయ్యా
    పాపశాపము బాపి నిత్య
    జీవమిడవయ్యా యేసయ్యా  ||పాపిని||

6    శాంతి గోరువారలెల్ల నీ
    చెంత కరిగినచో యేసయ్యా
    చింతలెల్ల దీర్చగలవు
    శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపిని||

7    పరమ రక్షకా నీదు ప్రేమ
    నెరుగ దరమౌనె యేసయ్యా
    పరులమైన మమ్ము బ్రోవ
    వేచియున్నావా యేసయ్యా       ||పాపిని||

8    నాదు హృదయము నీదె సుమ్మా
    నీవె గైకొనుమా యేసయ్యా
    శుద్ధ హృదయము జేసినను నీ
    సుతునిగా జేయు మేసయ్యా ||పాపిని||

4 comments:

  1. Superb lirics👌👌👌🙏 praise the lord

    ReplyDelete
  2. I want With singing

    ReplyDelete
  3. I want With singing

    ReplyDelete