Friday, 25 December 2015

ఇదిగో నా శిష్యులారా

    ఇదిగో నా శిష్యులారా 
    యెఱుకలుంచుడి
    మోక్ష-సదనమున 
    కేనుబోదు-సంతోషించుడి

1    యెరూషలేమందుండి
    మీ-రెదురు చూడుఁడి
    మీ పైఁ- బరిశుద్ధాత్మయు దిగి వచ్చి
    పనులు దెల్పును        ||ఇదిగో||

2    దిక్కులేనట్లు మిమ్ము 
    దిగనాడి పోను-మీతో 
    మక్కువౌయుండఁ
    బరిశు-ద్ధాత్మను బంపెదను   ||ఇదిగో||

3    నిర్యాణమున మీ కొఱకై
    నెలవులు కల్పింతు
    నాతో-సర్వ కాలము నిత్య
    సామ్రాజ్యము నేల       ||ఇదిగో||

4     ఒకరితో నొకరు ప్రియము 
    లొప్పియుండుడి
    నాదు సకలాజ్ఞలందు నిదియె
    సార మనుకొనుడి        ||ఇదిగో||

5    ఏదైననాపేరిటమీరించుక 
    వేడినను-మీకు
    మోదముతోడ   
    దానిముందే చేయుదును       ||ఇదిగో||

6     ఉల్లములందు గలత లెల్ల
    విడువుడి నేను మళ్ళి వచ్చెడి
    విధము-మరవకుండుడి       ||ఇదిగో||

1 comment: