Friday, 25 December 2015

దాసులార ధరణిని యేసుకు

    దాసులార ధరణిని యేసుకు
    ప్రేమతో స్వంతము చేసెదం 
    ప్రేమతోయేసుని     చాటెదం
    ప్రభుని చూపింతుం చీకటి    పోగొట్టి 
    వెల్గు ప్రకాశింప

1.    ప్రయాసపడి భారము మోయువారిని 
    అతి ప్రేమతో ఆహ్వానింతుము 
    పాప భారమెల్ల ప్రభువు
    మనో దుఃఖముల సర్వాధికారముతో
    మోసి తీర్చెను        ||దాసు||

2.    ఆకలి వ్యాధులు గలవారికి
    ప్రేమతో సాయము జేసెదం      
    ఉచితముగ మేళ్లతో నిండి
    తనను     తానే మరచి యేసు
    ఓర్పుతో తిరిగెన్‌        ||దాసు||

3.    ఇరుకులు ఇబ్బందులు గలవారిని
    నీచులన్‌ ఘనులుగ మార్చెదం
    సహించలేని కష్టములలో
    నిష్ఠూరములలో అగాధ గోతిలో 
    పడినవారిని            ||దాసు||

4.     హిందూదేశ స్త్రీ పురుషులను
    వింత వెలుగునకు మార్చెదం
    సుందర సుగుణ శీలుఁడై
    అధిక జ్ఞానుండై బంధంబుల్‌ దెంచి 
    ప్రవర్థమానుండై       ||దాసు||

5.     మార్గము తప్పి నడుచువారిని
    సత్య మార్గములో చేర్చెదం
    పట్టుతో ప్రార్థన చేతుము 
    ఆరాధింతుము సేవను జేతుము 
    జయమొందెదం       ||దాసు||

1 comment: