Friday, 25 December 2015

యేసూ నన్ను ప్రేమించినావు

    యేసూ నన్ను ప్రేమించినావు
    పాపినైన నన్ను ప్రేమించినావు

1.    నన్ను ప్రేమింపమా
    నవరూప మెత్తి
    దానముగా జీవము సిల్వపై
    నిచ్చి కన్న తలిదండ్రుల
    యన్న దమ్ముల ప్రేమ
    కన్న మించిన ప్రేమతో      ||యేసు||

2.    తల్లి గర్భముననే
    ధరియింప బడినపుడే
    దురితుండనై యుంటిని
    నా వల్ల జేయ బడెడు
    నెల్ల కార్యము లెప్పు
    డే హ్యంబులై యుండగా     ||యేసు||

3.    మంచినాలో పుట్ట
    దంచు నీ వెరిగినన్‌
    మించి బ్రేమించి నావు
    ఆహా యెంచ శక్యముగాని
    మంచి నాలో బెంచ
    నెంచి ప్రేమించినావు       ||యేసు||

4.    నన్ను బ్రేమింప నీ
    కున్నకష్టములన్ని
    మున్నె తెలిసి యుంటివి
    తెలిసి నన్ను బ్రేమింప 
    నీకున్న కారణమేమో
    యన్నా తెలియదు చిత్రము  ||యేసు||
5.    నా వంటి నరుడొకడు
    నన్ను ప్రేమించిన
    నా వలన ఫలము గోరు
    ఆహా నీవంటి పుణ్యునికి
    నా వంటి పాపితో
    కేవలం బేమిలేక      ||యేసు||

No comments:

Post a Comment