Friday, 25 December 2015

యేసు శీఘ్రముగా వచ్చున్‌

    యేసు శీఘ్రముగా వచ్చున్‌
    ఆశతో కనిపెట్టుడి

1    గురుతులెల్ల-లోకమంతా
    సరిగ చూడ కాననగున్‌
    పరిశుద్ధమైన ప్రవర్తనతో
    ప్రభుకై కనిపెట్టుడి       ||యేసు||

2    ప్రొద్దు గ్రుంకి-వచ్చునేమో
    అర్థరాత్రి యందేమో
    ఉదయము కోడికూతలపుడు
    వచ్చునేమో కనిపెట్టుడి       ||యేసు||

3    సిద్ధపడుడి-మీరిలలో
    మీరు దేవుని సంధింప
    సిద్ధపడుడి-తీర్పునకై
    ప్రభువుకై కనిపెట్టుడి        ||యేసు||

4    పరిశుద్ధులై-జీవించుడి
    ప్రభుని చిత్తము చేయుడి
    మరణమే యేసునందు సుమ్మా
    మేలుకొని కనిపెట్టుడి       ||యేసు||

5    యేసువలె-జీవించుడి
    తీసివేయుడి మలినములన్‌
    మోసంపుటాశ-లన్ని విడిచి
    ఆశతో కనిపెట్టుడి       ||యేసు||

6    వేషధారణ విడచి మీరు
    యేసు ముద్రలు ధరియించి 
    పెండ్లి కుమారుని సంధింప
    అందరు కనిపెట్టుడి       ||యేసు||

7    మేఘముపై-వెళ్లిన ప్రభు
    వేగముగ వచ్చు నిల
    సకల శ్రమలను-భరించి
    హల్లెలూయ పాడుడి       ||యేసు||

7 comments: