రమ్మూ నీ తరుణమిదే పిలుచుచున్నాడు
నీ ప్రభువైన యేసు నొద్దకు - రమ్మూ
1. జీవితమంతయు వ్యర్థముగాను
దుఃఖముతోను గడుపుటయేల
వచ్చి ఆయన శరణుజొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్మూ||
2. కట్టిన యిల్లు ధన ధాన్యములు
కనబడు బంధు మిత్రాదులును
గూడు విడచి నీవు పోయినచో
వెంట నీతో రారెవరు ||రమ్మూ||
3. అందము మాయ నిలకడలేనిది
దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చున్
మరువకు నీ ప్రభువును ||రమ్మూ||
4. మిన్ను క్రిందన్ భూమి మీదన్
మిత్రుడు యేసునామముగాక
రక్షణ పొందు దారిలేదు
రక్షకుడేసే మార్గము ||రమ్మూ||
5. తీరని పాప వ్యాధులను
మారని నీదు బలహీనతను
ఘోర సిలువలో మోసి తీర్చెన్
గాయములచే బాగుపడన్ ||రమ్మూ||
6. సత్యవాక్కును నమ్మిరమ్ము
నిత్యజీవము నీకు యిచ్చును
నీ పేరు జీవపుస్తకమునందు
నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్మూ||
నీ ప్రభువైన యేసు నొద్దకు - రమ్మూ
1. జీవితమంతయు వ్యర్థముగాను
దుఃఖముతోను గడుపుటయేల
వచ్చి ఆయన శరణుజొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్మూ||
2. కట్టిన యిల్లు ధన ధాన్యములు
కనబడు బంధు మిత్రాదులును
గూడు విడచి నీవు పోయినచో
వెంట నీతో రారెవరు ||రమ్మూ||
3. అందము మాయ నిలకడలేనిది
దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చున్
మరువకు నీ ప్రభువును ||రమ్మూ||
4. మిన్ను క్రిందన్ భూమి మీదన్
మిత్రుడు యేసునామముగాక
రక్షణ పొందు దారిలేదు
రక్షకుడేసే మార్గము ||రమ్మూ||
5. తీరని పాప వ్యాధులను
మారని నీదు బలహీనతను
ఘోర సిలువలో మోసి తీర్చెన్
గాయములచే బాగుపడన్ ||రమ్మూ||
6. సత్యవాక్కును నమ్మిరమ్ము
నిత్యజీవము నీకు యిచ్చును
నీ పేరు జీవపుస్తకమునందు
నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్మూ||
No comments:
Post a Comment