Friday, 25 December 2015

రాకడ సమయంలో

    రాకడ సమయంలో
    కడబూర శబ్దముతో
    యేసుని చేరుకొనే 
    విశ్వాసము నీకుందా
    రావయ్యా యేసయ్యా
    వేగమె రావయ్యా (2)

1    యేసయ్య రాకడ సమయంలో
    ఎదురేగే రక్షణ నీకుందా
    లోకయాశలపై విజయం నీకుందా ||రావ||

2    ఇంపైన ధూప వేదికగా
    ఏకాంత ప్రార్థన నీకుందా
    యేసు ఆశించే దీన మనస్సుందా ||రావ||

3    దినమంతా దేవుని సన్నిధిలో
    వాక్యము కొరకు ఆకలి నీకుందా
    యేసు నాధునితో సహవాసం 
    నీకుందా         ||రావ||

4    శ్రమలోన సహనం నీకుందా 
    స్తుతియించే నాలుక నీకుందా
    ఆత్మల కొరకైనా
    ఆవేదన నీకుందా        ||రావ||

5    నీ పాప రోత జీవితము
    నీ పాప హృదయం మారిందా
    నూతన హృదయంతో
    ఆరాధన నీకుందా          ||రావ||

6    అన్నిటికన్నా మిన్నగను
    కన్నీటి ప్రార్థన నీకుందా
    ఎల్ల వేళల స్తుతియాగం
    నీకుందా          ||రావ||

1 comment:

  1. Oka manishi aathmiya jeevitham ee vidhanga vunte rakadalo devunitho patuga velathamu God bless your family

    ReplyDelete