Friday, 25 December 2015

సాగిలపడి మ్రొక్కెదము

    సాగిలపడి మ్రొక్కెదము - 
    సత్యముతో ఆత్మలో మన 
    ప్రభు యేసుని - ఆ....ఆ....ఆ....

1.    మోషే కంటె శ్రేష్టుడు - అన్ని 
    మోసముల నుండి విడిపించున్‌
    వేషధారులను ద్వేషించున్‌  
    ఆశతో మ్రొక్కెదము          ||సాగి||

2.    అహరోను కంటె శ్రేష్టుడు  
    మన ఆరాధనకు పాత్రుండు
    ఆయనే ప్రధాన యాజకుడు 
    అందరము మ్రొక్కెదము     ||సాగి||

3.    ఆలయము కన్న శ్రేష్టుడు – నిజ
     ఆలయముగ తానే యుండెన్‌
    ఆలయము మీరే యనెను  
    ఎల్లకాలము మ్రొక్కెదము    ||సాగి||

4.    యోనా కంటె శ్రేష్టుడు
      ప్రాణదానముగా తన్ను అర్పించెన్‌
    మానవులను విమోచించెన్‌
     ఘనపరచి మ్రొక్కెదము      ||సాగి||

5.    సొలోమోను కన్న శ్రేష్టుడు 

    సర్వజ్ఞానమునకు ఆధారుండు
    పదివేలలో అతి ప్రియుండు 
     పదిలముగా మ్రొక్కెదము    ||సాగి||

6.    రాజులకంటె శ్రేష్టుడు  
    యాజకులనుగా మనలను చేసెన్‌
    రారాజుగ త్వరలో వచ్చున్‌ 
    రయముగను మ్రొక్కెదము  ||సాగి||

7.    అందరిలో అతి శ్రేష్టుడు – మన
     కందరికి తానే ప్రభువు
    హల్లెలూయకు పాత్రుండు 
    అనుదినము మ్రొక్కెదము   ||సాగి||

No comments:

Post a Comment