Friday, 25 December 2015

ఆనందమానందమాయెను

    ఆనందమానందమాయెను
    నాదు ప్రియ కుమారుని యందు
    నా తనయుని మాట వినండని 
    శబ్దమొక్కటి యా మేఘములో
    ఉద్భవించె నద్భుతముగ   ||మహ||

1    ప్రేమించుచున్నావు నీతిని
    దుర్నీతిని ద్వేషించినావు - నీవు
    అందుచే నీ తోటి వారి కంటె
    ఆనందతైలముతో తండ్రి నిన్ను
    అధికంబుగా నభిషేకించెను.   ||మహ||

2    అంత్యదినముల యందున
    ఆ వింత కుమారుని ద్వారా
    ఈ మానవుల తోడ మాట్లాడెను
    సర్వంబునకు తండ్రి తనయుని
    వారసునిగా నియమించెను   ||మహ||

3    తనయుండె ఆ తండ్రి మహిమ
    ఆ తత్వంబు రూపంబు తానె
    ఆ మహాత్మ్యమైనట్టి మాట చేత
    సమస్తమును నిర్వహించుచు
    అందరిలో అతి శ్రేష్ఠుండాయె  ||మహ||

4    నీవు నాదు కుమారుండవు
    నిన్ను ప్రేమించి కన్నాను నేను
    నేడు దండిగ తనయుని ముద్దాడుడి
    నిండుగ వాని నాశ్రయించుడి
    రండి రండి-ధన్యులు కండి   ||మహ||

5    విజ్ఞాన సంపదలెల్లను
    ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను
    ఆ సంతోషమును పరిశుద్ధత
    సమాధానము నీతి శక్తియు
    విమోచనమాయెను యేసు  ||మహ||

6    అందరి కన్న నీ వెంతనో
    అతి సుందరుడవై యున్నావు
    నీవు నీ పెదవుల మీద పోయబడి
    నిండి యున్నది దయారసము
    నిన్నాశీర్వదించును తండ్రి       ||మహ||

7    దివ్య రారాజై కుమారుడు
    ఒక వెయ్యి వర్షాలు పాలించును
    మహా అంతములేని రాజ్యమేలును
    ఎందరు జయంబు నొందెదరో ||మహ||

No comments:

Post a Comment