Friday, 25 December 2015

ఉన్నపాటున వచ్చు-చున్నాను

    ఉన్నపాటున వచ్చు-చున్నాను
    నీ పాద-సన్నిధి కో రక్షకా
    యెన్న శక్యముగాని పాపము లన్ని
    మోపుగ వీపుపైబడి
    యున్న నిదె నడలేక తొట్రిలు
    చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||

1.    కారుణ్యనిధియేసు-నా రక్షకా
    నీ శ-రీర రక్తము చిందుట
    భూరి దయతో నన్ను నీ దరి
    జేరరమ్మని పిలుచుటయుని
    ష్కారణపు నీ ప్రేమ యిది మరి
    వేరే హేతువు లేదు నా యెడ  ||ఉన్న||

2.    మసి బొగ్గువలె నా మా-ససమెల్లగప్పె
    దో-ష సమూహములు మచ్చలై
    అసితమగు ప్రతి డాగు తుడువను
    గడటుగడిగి పవిత్రపరపను
    నసుపు లిడు నీ రక్తమే యని
    మసల కిప్పుడు సిలువ నిదెగని ||ఉన్న||

3.    వెలుపట బహు యుద్ధ-ములు
    లోపటను భయము-కలిగె నెమ్మది
    దొలగెను-పలు విధములగు
    సందియంబుల-వలనబోరాట
    ములచే నే-నలసి యిటునటు
    గొట్టబడి దు-ర్భలుడనై 
    గాయములతో నిదె    ||ఉన్న||

4.    కడు బీదవాడ నం-ధుడను 
    దౌర్భాగ్యుడను-జెడిపోయి పడి
    యున్నాను-సుడివడిన నా మదికి
    స్వస్థత జెడిన కనులకు
    దృష్టి భాగ్యము బడయవలసినవన్ని
    నీచే-బడయుటకు నా 
    యొడయడా యిదె    ||ఉన్న||

5.    నీ వాగ్దాత్తము నమ్మి-నీపై భారము 
    పెట్టి-జీవమార్గము గంటిని
    కేవలంబగు ప్రేమచేతను నీవు
    నన్ను క్షమించి చేకొని
    భావశుద్ధి నోనర్చి సంతోషావసరముల
    నిడుదువని యిదె    ||ఉన్న||

6.    దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ
    తరమే వర్ణన చేయను
    తెరవు కడ్డంబైన యన్నిటి-విఱుగ
    గొట్టెను గాననే నిపుడరుదుగా 
    నీవాడ నవుటకు-మరి నిజము
    నీ వాడ నవుటకే    ||ఉన్న||

No comments:

Post a Comment