Friday, 25 December 2015

పరవాసినినే జగమున ప్రభువా

    పరవాసినినే జగమున ప్రభువా
    నడచుచున్నాను నా దారిన్‌
    నా గురి నీవే నా ప్రభువా
    నీదరినే చేరెదను-నేను

1.    లోకమంతా నాదని యెంచి
    బంధుమిత్రులే ప్రియులను కొంటిని   
    అంతయు మోసమేగా
    వ్యర్థము సర్వమును-ఇలలో    ||పర||

2.    ధన సంపదలు గౌరవములు
    దహించి పోవు నీ లోకమున
    పాపము నిండె జగములో
    శాపము చేకూర్చుకొనె లోకము  ||పర||

3.    తెలుపుము నా అంతము నాకు 
    తెలుపుము నా ఆయువు యెంతో 
    తెలుపుము యెంత అల్పుడనో
    విరిగి నలిగియున్నాను-నేను    ||పర||

4.    ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
    నీ రక్తముచే మార్చబడితిని
    క్షమాపణ పొందితివనగా
    మహానందము కలిగె-నాలో     ||పర||

5.    యాత్రికుడనే నీలోకములో
    సిలువ మోయుచు సాగెదనిలలో   
    అమూల్యమైన ధనముగా
    పొందితిని నేను-యేసుని          ||పర||

6.    నా నేత్రములు మూయబడగా
    నాదు యాత్ర ముగియునిలలో
    చేరుదున్‌ పరలోక దేశము    నాదు 
    గానము యిదియే యిలలో     ||పర||

No comments:

Post a Comment