Friday, 25 December 2015

జై జై జై జై రాజుల రాజ

    జై జై జై జై రాజుల రాజ
    పాత్రుడ నీవే మా ప్రభు నీవే
    జై జై జై జై రాజుల రాజా

1    అన్ని కాలములలో నీ నామము  
    మహోన్నతంబౌ - మహోన్నతుండ 
    వాగ్దానము నెరవేర్చిన దేవ
    మాట తప్పని  మహోపకారి       ||జైౖ||

2    దూతల మాదిరి గీతముల్‌ పాడుచు
    సతతము నిన్నే స్తోత్రించెదము 
    గొల్లలు గాంచిన ఘన కాపరి మా
    ఉల్లములందు ఉల్లసించెదము  ||జైౖ||

3    తూర్పున తారను గాంచిన జ్ఞానులు 
    రాజుల రాజ నీవే యనుచు 
    బంగారము సాంబ్రాణి బోళమును
    అర్పించి ఆరాధించిరిగా          ||జైై||

4    ధనవంతుడ వగు ఓ మా ప్రభువా 
    ధనహీనుడుగా నైతివ మాకై - మా 
    దారిద్య్రము తీసివేయ
    నరరూపమున - జన్మించితివా    ||జై||

5    యేసు ప్రభుండ రక్తము కార్చి
    ఎంచి మమ్ము విమోచించితివా
    ఎంచలేము నీ మేలుల నెపుడు
    ఎన్నదగిన మా దేవుడ  వీవె       ||జైౖ||

6    మాకై సిలువలో మరణించితివా
    మరణపు ముల్లును విరచిన  ప్రభువా 
    యుగయుగములకు నీకె మహిమ
    నిరతము స్తోత్రము హల్లెలూయ  ||జైౖ||

No comments:

Post a Comment