Sunday, 27 December 2015

యెరుషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర

   yerushalemulo gorrela dwaramu dhaggara
   యెరుషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర
    బేతెస్థ కోనేరు కలదు-అందు 
    మంటపములైదు చుట్టు గలవు

1  కుంటివారు గ్రుడ్డివారు
    ఊచకాలు సేతులు కలవారు
    గుంపులు గుంపులుగా
    అక్కడ పడియుండిరి        ||యెరు||

2  దేవదూత దిగువేళ నీళ్ళు కదలును
    ఆ నీళ్ళు కదలు వేళ రోగం బాగు పడును
    ఏ రోగి ముందు దిగునో
    ఆ రోగి బాగుపడును        ||యెరు||

3. ముప్పది ఎనిమిది యేండ్ల నుండి    
    రోగి ఒక్కడు
    స్వస్థత నొందలేక అందు పడి యుండెను
    యేసు వచ్చి వానిని ముట్టి    
    స్వస్థపరచెను          ||యెరు||

4  యేసు లేక లోకమందు మేలు ఉండదు
    ఏ మేలు ఉన్న లోకమందు
    శాంతి ఉండదు
    యేసు ఉంటే శాంతి ఉంది
    కాంతి ఉంటుంది       ||యెరు||

4 comments: