Friday, 25 December 2015

నీవు తోడైయున్న జాలు-యేసు

    నీవు తోడైయున్న జాలు-యేసు 
    నిత్యము నా కదిమేలు-నీవు  
    ధరణినుండు-నీచ పాపులనెల్లఁ
    గావబ్రేమ వచ్చి-ఘన ప్రాణమిడినట్టి

1.    నిను బోలు రక్షకుండేడి-క్రీస్తు
    నను బోలు పాతకుండేడి-నిను నమ్ము 
    వారలకు నీ వొసగుచుందువు-తనర 
    పాపక్షమ- దయచేత నిలలోన     ||నీ||

2.    నీ పాటి బలవంతుడేడి-ప్రభు
    నాపాటి దుర్భలుండేడి-కాపాడుచుందువు
    కల కాలమును నీవు
    నీ పాద సేవకుల-నీ 
    నేర్పు రంజిల్ల            ||నీ||

3.    నీ వంటి యుపకారి యేడి-కర్త 
    నావంటి కడు దీనుడేడి-జీవులకును 
    గల్గు-జీవంబులిచ్చుచు జీవాధారములొసగి 
    జీవుల బ్రోచెడి            ||నీ||

4.    నీవంటి ధనవంతుడేడి-యేసు 
    నావంటి ధనహీనుడేడి-ప్రోవులైయున్నవి 
    యీవులు నీ యందు నీవు వాని 
    నొసంగి నిరతంబునను గావు     ||నీ||

No comments:

Post a Comment