Friday, 25 December 2015

లెమ్ము తేజరిల్లుము నీకు

    లెమ్ము తేజరిల్లుము నీకు
    వెలుగు వచ్చియున్నది
    యెహోవా మహిమ నీపై 
    ప్రకాశముగా నుదయించె ||లెమ్ము||

1. జనములు నీదు వెలుగునకు
    పరుగెత్తి వచ్చెదరు
    రాజులు నీదు ఉదయ
    కాంతికి వచ్చెదరు       ||లెమ్ము||

3. సముద్ర వ్యాపారము
    నీవైపు త్రిప్పబడును
    జనముల ఐశ్వర్యము
    నీ యొద్దకు వచ్చును       ||లెమ్ము||

4. దేవదారు సరళ గొంజి
    చెట్లు నా ఆలయమునకు
    తేబడును నాదు పాద
    స్థలము మహిమ పరచెదను ||లెమ్ము||

5. నిన్ను శాశ్వతమైన
    శోభాతిశయముగ జేతున్‌ 
    బహుతరములకు సంతోష
    కారణముగ జేసెదను       ||లెమ్ము||

6. వారిలో ఒంటరియైన
    వాడు పది వందలగును
    ఎన్నిక లేనివాడు
    బలమైనట్టి జనమగును      ||లెమ్ము||

4 comments:

  1. 4. నీ ఆలయమునకు
    నీదు పాద స్థలము

    ReplyDelete
  2. Good సాంగ్ బ్రదర్

    ReplyDelete