Friday, 25 December 2015

హే ప్రభుయేసు - హే ప్రభు యేసు

    హే ప్రభుయేసు - హే ప్రభు యేసు
    హే ప్రభు దేవసుతా
    సిల్వ ధరా, పాప హరా, శాంతికరా

1.    శాంతి సమాధానాధిపతీ
    స్వాంతములో ప్రశాంతనిధీ
    శాంతి స్వరూపా, జీవనదీపా
    శాంతి సువార్తనిధీ         ||సిల్వ||

2.    తపములు తరచిన నిన్నె గదా
    జపములు గొలిచిన నిన్నెగదా 
    విఫలులు జేసిన విజ్ఞాపనలకు
    సఫలత వీవెగదా        ||సిల్వ||

3.    మతములు వెదకిన నిన్నె గదా    
    వ్రతములు గోరిన నిన్నె గదా
    పతితులు దేవుని సుతులని నేర్పిన
    హితమతి వీవెగదా        ||సిల్వ||

4.    పలుకులలో నీశాంతి కథ
    తొలకరి వానగ గురిసెగదా
    మలమల మాడిన మానవ హృదయము 
    కలకలలాడెకదా        ||సిల్వ||

5.    కాననతుల్య సమాజములో
    హీనత జెందెను మానవత
    మానవ మైత్రిని సిల్వపతాకము
    దానము జేసెగదా        ||సిల్వ||

6.    దేవుని బాసిన లోకములో 
    చావుయె కాపురముండెగదా
    దేవునితో సఖ్యంబును జగతికి
    యీవి నిడితివి గదా        ||సిల్వ||

7.    పాపముచేసిన స్త్రీనిగని
    పాపులకోపము మండెగదా
    దాపునజేరి పాపిని బ్రోచిన
    కాపరి వీవెగదా        ||సిల్వ||

8.    ఖాళీ సమాధిలో మరణమును
    ఖైదిగ చేసిన నీవెగదా
    ఖలమయుడగు సాతానుని గర్వము 
    ఖండనమాయెగదా        ||సిల్వ||

9.    కలువరిలో నీ శాంతి సుధా
    సెలయేఱుగ బ్రవహించెగదా
    కలుష యెడారిలో కలువలు పూయుట 
    సిలువ విజయముగదా         ||సిల్వ||

No comments:

Post a Comment