Friday, 25 December 2015

బహుగా ప్రార్థన చేయుడి

    బహుగా ప్రార్థన చేయుడి
    ఇకమీదట బహుగా ప్రార్థనచేయుడి
    బహుగా ప్రార్థన చేసి-బలమున్‌ 
    సంపాదించి - మహిలో కీడును 
    గెల్వుడి-దేవుని కెపుడు-మహిమ 
    కలుగనీయుడి

1.    చెడుగెక్కువగుచున్నది-భూలోకమున 
    చెడుగెక్కువగుచున్నది
    చెడుగుపై మంచిపై-చేయగలదౌనట్లు 
    విడువక ప్రార్థించుడి-మీ ప్రార్థన 
    కడవరకు బోనీయుడి     ||బహుగా||

2.    వాగ్దానములు చూడుడి-దేవుని గ్రంథ 
    వాగ్దానములు జూడుడి
    వాగ్దానముల్‌ జరుగ వలసిన 
    కార్యంబుల్‌  
    వాగ్దానములు నమ్ముడి ఈ రీతిగా 
    ప్రభుని సన్మానించుడి     ||బహుగా||

3.    విందు నన్న దేవుని-వాగ్దానము 
    విందుగా ధ్యానించుడి
    విందులో నుండగా-వింతగ నెరవేర్పు
    బొందియానందింతురు-ఇది రెండవ 
    విందంచు గ్రహింతురు      ||బహుగా||

4.    విసుగుదల జెందరాదు-ప్రార్థన 
    నెరవేర్పు తత్‌క్షణమె రాదు 
    విసుగున్నచో సిద్ధి-వెనుకకే పోవును 
    వసియించుడి దేవుని-వాగ్దానమున 
    భటులవలె నిల్వుడి     ||బహుగా||

5.    సంశయము పనికిరాదు-లేశంబైన
    సంశయము పనికిరాదు
    సంశయింపక దైవ సన్నిధియందు మీ 
    యంశము విడచెప్పుడి-దానికి గొప్ప 
    యంశం బట్టనీయుడి     ||బహుగా||

6.     సిద్ధి కనుపింపకున్న-వాగ్దానము 
    సిద్ధియున్నది చూడుడి-సిద్ధి యప్పుడు  
    మీకై సిద్ధవై వెడలి ప్ర-సిద్ధిలోనికి 
    వచ్చును-మీ నమ్మిక వృద్ధిగాంచి 
    నిల్చును     ||బహుగా||

7.    సంతోషమందరారె-మన దేవుని 
    సంస్తుతి చేయరారె-సంతోషబలముచే 
    సర్వ కష్టములను-అంతరింపజేతుము
    మన దేవుని సంతోష 
    పరచెదము     ||బహుగా||

8.    అంతయు మనదేగదా-యేసుని 
    కున్నదంతయు మనదె గదా
    అంతయు మన ప్రభువు 
    ఆర్జించియున్నాడు-స్వంతమని 
    అందుకొనుడి-మీ ఆత్మకు శాంతి 
    జెందనీయుడి     ||బహుగా||

9.    విజయ జీవనము మనదె-క్రీస్తిచ్చిన 
    విజయ జీవనము మనదె విజయ 
    జీవనము మనదె విశ్వమంతయు 
    మనదె-భజన సంఘంబు మనదె    
    దేవుడున్న పరలోకమెల్ల
    మనదె     ||బహుగా||

7 comments: