Friday, 25 December 2015

పాపమునకు జీతము మరణం

1    పాపమునకు జీతము మరణం
    ఓ పాపి భయపడవా
    చూచునదెల్ల నశించు నిశ్చయం
    చూడనిదే నిత్యము
    యేసురాజు వచ్చును
    ఇంకాకొంత కాలమే
    మోక్షమందు జేరుదుము

2    లోక సుఖము నమ్మకు నమ్మకు
    ఆ యిచ్ఛలన్ని మాయమగును
    నీ జీవము పోవు సమయమున
    చిల్లిగవ్వ వెంటరాదు    ||యేసు||

3    నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది
    లోకమాయలలో - చిక్కినందున
    దైవకోపము దిగివచ్చుటకు ముందు 
    నీ రక్షకుని జేరుము    ||యేసు||

4    దేవుని ప్రేమ పారుచున్నది
    కల్వరి గిరి నుండి యిదిగో
    నీ పాప మెల్లపోవును అందున
    స్నానము చేసినట్లయిన    ||యేసు||

5    మహా పాపినైన నన్నును నన్నును
    నా మిత్రుడంగీకరించెనే
    ఓ పాపి నీవు పరుగిడుమా
    దేవ దీవెనలు పొందుమా    ||యేసు||

6    కష్ట దుఃఖము లెక్కుడగుచో
    ఇష్టు డేసుని వీడకు వీడకు
    సిగ్గులేక చేరుము దేవుని
    చెంత నెప్పుడు వసించుము||యేసు||

7    నీ పాపములకై మనస్తాపము
    బొంది యేసు నొద్దకు వేగరా
    భయమును పోగొట్టి మన్నింపగా
    స్తుతిపాడు హల్లెలూయా    ||యేసు||

3 comments: