Friday, 25 December 2015

ఓ సోదరా... ఓ సోదరీ...

    ఓ సోదరా... ఓ సోదరీ...
    యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు 
    నిదురమాను, మగత వీడు
    కన్ను విప్పి కలియ జూడు(2)

1.    యెరుషలేము గుమ్మములు 
    కాలిపోతున్నవి
    ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి
    ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో 
    పునఃనిర్మాణము చేతము రండి   ||ఓ||

2.    నిరాశ నిస్పృహలే ఎదురు నిలిచినా
    నిందలెన్నో మబ్బులుగ మనల కమ్మినా 
    నిలిచెదం యేసుతో, నడిచెదం దీక్షతో 
    నిరీక్షణా బలముతో సాగిపోదము  ||ఓ||

3.    అపవాది బాణములు ఎన్ని విసిరినా
    అగ్ని గంధకముల వాన చుట్టుముట్టినా 
    అదరము, బెదరము, 
    అరికి మనము వెరవము అన్న 
    యేసు సన్నిధిలో లేదిక భయము ||ఓ||

4.    సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా 
    చావునోడించినది ఈ దేహమే కదా
    సిలువ తేజస్సుతో, కరుణ మూర్తి 
    మనసుతో సిరులు విరియు
    జీవితాలు నిర్మిద్దాము           ||ఓ||

5.    యేసే ఈ సంఘమునకు అసలు పునాది 
    యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి  
    యేసే ఆరంభము ఆయనే 
    అంతము యేసే
    మన  జీవితాల నవవసంతము   ||ఓ||

6.    సాక్ష్యమిచ్చె సంఘమే

14 comments:

  1. Thanq for posting lyrics. But keep all the stanges.

    ReplyDelete
  2. Full song please

    ReplyDelete
  3. సాక్షమిచే సంఘమే జీవించే సంఘము
    జీవించే సంఘమే సాక్షమిచ్చు సంఘము
    సాక్షము విశ్వాసము సౌక్యము సహవసము(2)
    సిలువ చలువ పందిరిలో వర్ధిల్లాలి

    ReplyDelete
  4. 7. విజయంత నిజముగ యేసు ప్రభునివే - కుజనుడైన సాతాను ఒడిపోవులే - సృజనాత్మక శక్తితో - శిలువ త్యాగాస్పుర్తి తో స్వర్డారహిత సేవలను సగిద్దాము. 8. శాంతి ధ్వజము మనమందు నడచుచుండగా - శిలువ జ్యోతి మార్గమును చుపుచుండగా - సాగుని ఉద్యమం - ఆగదూ ఈ రథం - శ్వమియేసు సామ్రాజ్యం నిలుచును నిరంతరం

    ReplyDelete
  5. వెరీ నైస్ సాంగ్ ,పాట చాలా చాలా భాగుంధి

    ReplyDelete
  6. అద్భుతమైన పాట మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻

    ReplyDelete
  7. Old is gold athmiyamga adugudala chesea song

    ReplyDelete
  8. ఈ పాట నేను రక్షణ పొందినప్పటినుంచి గత 30 సంవత్సరాలుగా పాడుకుంటున్నాను ఎంత పాడిన ఆశ తీరకుండా చేస్తుంది. ఎప్పుడు పాడిన నూతన ఉజ్జీవం నూతన ఉత్సాహంతో నింపుతుంది ఈ పాట మరల మాకు అందించినందుకు మీకు వందనాలు

    ReplyDelete
  9. Nice🙏🙏🙏

    ReplyDelete
  10. Very nice lyric

    ReplyDelete
  11. Very nice lyric

    ReplyDelete