Thursday, 24 December 2015

స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ

స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ
సత్యముతో నాత్మతో నెపుడు
పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం    ||స్తో||

1. ధవళ వర్ణుడ - రత్న వర్ణుడ
సత్యరూపి యనబడువాడ
నను రక్షించిన రక్షకుండ
నాథ నీకె శరణం శరణం         ||స్తో||

2. శ్రేష్టయీవుల నిచ్చినందున
శ్రేష్ట యీవుల ఊట నీవె
త్రిత్వమై యేకత్వమైన త్రి
యేకదేవా శరణం శరణం        ||స్తో||

3. పాపి మిత్రుడ పాప నాశుడ
పరమ వాసుడ ప్రేమ పూర్ణుడ
వ్యోమపీఠుడ స్వర్గ పూజ్యుడ
పరిశుద్ధాంగుడ శరణం శరణం   ||స్తో||

4. సంఘమునకు శిరస్సు నీవె
రాజ నీకె నమస్కారములు
ముఖ్యముగను మూలరాయి
కోట్ల కొలది శరణం శరణం      ||స్తో||

5. నీదు సేవకుల పునాదిది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు
వేడెదము శరణం శరణం       ||స్తో||

6. రాజ నీకె స్తుతి స్తోత్రములు
గీతముల మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యము
హల్లెలూయ ఆమెన్‌ ఆమెన్‌      ||స్తో||

No comments:

Post a Comment