Friday, 25 December 2015

సర్వమేసువే - నాకు సర్వమేసువే

    సర్వమేసువే - నాకు సర్వమేసువే
    సర్వ దుఃఖ నష్ట పరిహార మేసువే

1.    కాపరి - నన్‌ మేపును 
    కాపుదల నిచ్చును
    భావశుద్ధి - భాగ్యమొసగు 
    రక్షకుండేసుడే                  ||సర్వ||

2.    తల్లిదండ్రుల్‌-సోదరుల్‌
    సర్వము నాకేసువే 
    బంధువర్గం - మిత్రులు 
    సంపూర్ణ భాగ్యమేసువే         ||సర్వ||

3.    దుఃఖములో - ఆదరణ
    చీకటిలో జ్యోతియు 
    అన్ని వ్యాధి బాధల్‌ మాన్పు 
    చెంతనుండు ఔషధం          ||సర్వ||

4.    బోధకుండు - సాధకుండు
    యేసుడు నా నాథుడే 
    రాకపోకలందు నాకు  
    తోడుగుండు మిత్రుడే          ||సర్వ||

5.    అందము - సుగంధము
    ఆస్థియు నా స్వాస్థ్యము
    విమోచించి-హత్తుకొను 
    ప్రియ మధ్య వర్తియే          ||సర్వ||

6.    జీవాహార మయ్యెను
    వాంఛలన్ని తీర్చును
    జ్ఞానము - నిరీక్షణయు
    అంతులే నానందము         ||సర్వ||

No comments:

Post a Comment