Friday, 25 December 2015

పాపిగానే జీవింతువా

    పాపిగానే జీవింతువా
    పాపమునందే మరణింతువా ప్రియుడా 
    ప్రభుని ప్రేమను గుర్తింపవా    ||పాపి||

1     ఆశలు నిండిన-లోకమునందు
    ఆశలు ఎన్నో వుండునుగా
    అవి-నాశనమునకే నడుపునుగా
    ఆశలు త్రెంచి-ప్రేమను పెంచి
    ప్రభుని పథమున నడువుమా... ప్రియుడా

2    విన్న బోధ యిది-నాకు కాదుయని 
    నిర్లక్ష్యముగా వెడలెదవా!
    నీవు మారు మనస్సు పొందవా
    రేపు యనెడి రోజున యందు
    మరణము సంధించగా-మోక్ష 
    మార్గము ఇక లేదుగా... ప్రియుడా ||పా||

3    పాపము వలన శాపము కల్గెను
    శాపము వలన మరణము కల్గెను
    మరణపు ముల్లును విరచిన యేసు
    పాపివైన నీ కోసరమే 
    పాపినైన నా కోసరమే
    ప్రభువు  సిలువ నొందెనుగా... ప్రియుడా
4     లోకము నీది కాదని తెలుసు
    తెలిసిన నీవు తెలియకుందువా
    విడుదల లేని-జీవితమునకు వేదన 
    కలదోయీ నరక
    వేదన కలదోయీ ...ప్రియుడా    ||పా||

5     నీదు జీవితము స్థిరము కాదుయని
    యాత్రికుడవని మరచిపోతివా
    నీదు గమ్యము ఏదో తెలుసా
    తెలియకపోయినచో నీకు
    నరకము తప్పదుగా... ప్రియుడా ||పా||

No comments:

Post a Comment