Tuesday, 22 March 2016

తెల్లగ తెలవారక ముందె Thellaga thela varakamundhe

తెల్లగ తెలవారక ముందె
తొలికోడి కూయక ముందె||2||
లేచినాడే యేసు దేవుడు|2|
సమాదిగుండె చిల్చినాడే మృత్యుంజయుడు|2|

ఈ గుడిని పడగొట్టమన్నాడే
మూడురోజుల్లో లేపుతానన్నాడే||2||
తన దేహముగూర్చి ఈ మాట చెప్పినాడే|2|
మాట తప్పనివాడు చేసిచూపినాడే|2|..తెల్లగ

స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే యేసు
దేహానికి పూయాలని తలచినారే||2||
తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే|2|
ఖాళిసమాధిని చూచి నిజము నెరిగినారే|2|..తెల్లగ