Friday, 25 December 2015

తరుణమిదే-తరుణమిదే

    తరుణమిదే-తరుణమిదే
    పాపికి తరుణమిదే
    పరలోకము చేరుటకు
    ఆ నరకము తప్పుటకు

1    నీ ఆయువు నాలోచించుము
    నీ బ్రతుకును ఆలోచించుము
    నీ పాప ఫలితమెపుడో
    బహు భయంకర నరకమయా||తరు||

2    నీ పాపపు పరుగులతో
    ప్రళయాగ్నిలో చేరెదవా
    పరలోకపు మార్గమును
    తిరస్కారము చేసెదవా    ||తరు||

3    నీ కొరకై శ్రీ యేసు
    ఆ సిలువలో బలియాయెన్‌
    నీ రక్షణ గోరి సదా
    సువార్తను వినిపించెన్‌    ||తరు||

4    ప్రభు యేసుని రక్తములో
    పరిశుద్ధుడవై ధరలో
    పరమానందము నొందన్‌
    త్వరపడిరా ప్రార్థింపన్‌    ||తరు||

5    కృప కాలము దాటగనే
    అపాయపు దినములలో
    మనుజాళికి మహ శ్రమలు   
    కనిపించదు ఆశ్రయము    ||తరు||

6    నీ దేవుని సన్నిధిలో
    కనబడుటకు సిద్ధపడుమా
    నేడే రక్షణ దినము
    లోక కీడును విడచి రమ్ము    ||తరు||

10 comments:

  1. O. Wat. A wonder full song (it. Showes warning , punish ment. Prepeare his children paradise 😁😁😁

    ReplyDelete
  2. Meaning full song

    ReplyDelete
  3. True Gospel Song

    ReplyDelete
  4. Very good song

    ReplyDelete
  5. Hatsoff to lyricist for wonderful and meaningful song

    ReplyDelete
  6. Very good song

    ReplyDelete